*అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య*
జూన్ 13 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ
లక్షట్టిపేట మండలం అంకత్ పల్లి గ్రామానికి చెందిన గనవేణి రమేష్ అనే 41 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుడు గత ఆరు నెలల నుండి నడుము నొప్పితో అవస్థ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రులు చూపించి మందులు వాడిన నొప్పి నయం కావడం లేదు. అదే క్రమంలో ఎప్పుడు కుటుంబ సభ్యులతో ఎన్ని మందులు వాడిన నొప్పి నయం కావడం లేదని బాధపడితే కుటుంబ సభ్యులు నచ్చజెప్పినారు. నిన్న ఉదయం మృతుడు ఇంట్లో నుండి బయటకి వెళ్లి ఉదయం 9 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తన ఆచూకీ గురించి బంధువుల ఇండ్లలో చుట్టుపక్కల వెతికిన ఆచూకీ దొరక్క పోవడంతో నిన్న మధ్యాహ్నం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో పాటు అతని ఆచూకీ గురించి వెతుకుచుండగా సాయంత్రం లక్ష్మీపూర్ శివారులోని పంట పొలాల్లో అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య గనవేని లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎస్సై గోపాల సురేష్ తెలిపారు.

