ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం – సీఎం రేవంత్ రెడ్డి

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

జర్నలిస్టులకు సొసైటీల పేరుతో కాకుండా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో శనివారం జర్నలిస్టులతో జరిగిన భేటీలో సీఎం మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సంకల్పంతోనే కేబినెట్ సబ్ కమిటీ వేశాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురండి. సబ్ కమిటీ ఒకే చోట కూర్చొని సిఫార్సులు తీసుకువస్తే, మీరు టీ తాగే లోపే మినిట్స్ రాసి కేబినెట్‌లో ఆమోదిస్తాం అని చెప్పారు.

వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధానం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని సీఎం వివరించారు.సొసైటీలపై పిటిషన్ వేయడం సాధ్యమే, కానీ ఒక్కొక్కరి పేరు మీద ఇస్తే ఎవరూ పిటిషన్ వేయలేరు. ఒక్కొక్కరి పేరు మీదే వేయాల్సి వస్తుంది. అది ఆచరణ సాధ్యం కాదు. భవిష్యత్తులో ఈ ఇళ్ల స్థలాలపై ఎలాంటి వివాదాలు రాకూడదన్నదే మా ఉద్దేశం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నిర్ణయంతో వారి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...
error: Content is protected !!