ePaper
Friday, August 7, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 ఆగస్టు 13న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వారోత్సవాల ముగింపు సభను జయప్రదం చేద్దాం.

*దసలి రైతుల పై అటవీశాఖ అధికారుల దౌర్జన్యం మంత్రిగారికి కనబడడం లేదా*

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

*ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి.*

 

*తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) జిల్లా కమిటీ డిమాండ్*

 

ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వారోత్సవాల నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా చెన్నూరు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించడం ఈ ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాగాల రాజన్న ఎర్మ పున్నం మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవ వారత్సవాల ముగింపు సభను చెన్నూరు పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదివాసి దసలి రైతులపై అటవీశాఖ అధికారులు దౌర్జన్యాలు చేస్తుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న మంత్రి వివేక్ గారికి ఎందుకు కనపడటం లేదని ప్రశ్నించారు తరతరాలుగా ఆధారపడి జీవిస్తున్న దసలీ మరియు పోడు రైతుల పై అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతు అక్రమ కేసులు పెడుతున్నారని అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏనాడు కూడా పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధి కోసం గ్రామాలకు రోడ్డు కరెంటు విద్యా వైద్యం కోసం నిధులు కేటాయించవలసి ఉన్నప్పటికీ నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఆదివాసి హక్కుల సాధనకోసం, సంస్కృతిని కాపాడుకోవడానికి కొమరం భీం పోరాట స్ఫూర్తి తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన యుద్ధం చేయవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మడే గణేష్, కోర్తే సమ్మయ్య, కొండపల్లి వెంకటి, తలండి మల్లేష్ లు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!