తెలంగాణ రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు శ్రీ సి.వి. ఆనంద్, ఐ.పీ.ఎస్. నీ మర్యాదపూర్వక భేటీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP – Head of Police Force) గా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు సి.వి. ఆనంద్, ఐ.పీ.ఎస్. ని ఈరోజు హైదరాబాద్ లోని DGP కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. 1991 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా మూడు దశాబ్దాలకు పైగా అపార అనుభవం, నిబద్ధత, నిజాయితీతో ప్రజా సేవలో తనదైన ముద్ర వేసిన శ్రీ సి.వి. ఆనంద్ గారు రాష్ట్ర పోలీస్ శాఖకు పూర్తి స్థాయి DGP గా నియమితులు కావడం రాష్ట్రానికి గర్వకారణం. గతంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్ గా, వివిధ కీలక శాఖల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.ఈ సందర్భంగా మంతెన జగన్ మోహన్ రావు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ఆధునిక పోలీసింగ్ విధానాల అమలులో ఆయన నాయకత్వంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మరింత చేరువగా, పారదర్శకంగా, ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలని, ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను మరింత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

