నూతన దంపతులను ఆశీర్వదించిన జాతీయ వడ్డెర సంఘం (JVS) ఖమ్మం జిల్లా నాయకులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా బత్తుల గోపాలరావు :
ఖమ్మం నగరంలోని మంచి కంటి భవన్ లో నిర్వహించిన గొడ్డేళ్ల దుర్గారావు – లక్ష్మి దంపతుల కుమార్తె బేబి, నవీన్ కుమార్ ల వివాహ మహోత్సవానికి జాతీయ వడ్డెర సంఘం (JVS) ఖమ్మం జిల్లా టీమ్ నాయకులు మరియు సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కళ్యాణ వేదికపై నూతన దంపతులను కలిసి పూలమాలలతో సత్కరించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు ఆయురారోగ్యాలతో, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలని ఆశీర్వదించారు. హాజరైన ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు: వల్లెపు సోమరాజు. జిల్లా అధ్యక్షుడు: బత్తుల వీరబాబు నియోజకవర్గ అధ్యక్షుడు: కుంచపు కుమార్ ముఖ్య నాయకులు ..విడగొట్టి హనుమంతు ఆలకుంట అంజయ్యకుంచపు వెంకటేశ్వర్లు సంపంగి మల్లయ్య కుంచపు కుమార్ చల్లా యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.

