ePaper
Friday, September 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఈనెల 6న జరిగే టి యు సి ఐ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి

జూలూరుపాడు తెలంగాణ చరిత్ర, సెప్టెంబర్, 03: పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, ఖమ్మంలోఈనెల 6న జరిగే టి యు సి ఐ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ,) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాల్ రావు, గోనెల రమేష్ లు పిలుపునిచ్చారు..

జూలూరుపాడులోని కె జీ బి వి హాస్టల్ లో నాన్ టీచింగ్ వర్కర్స్ జనరల్ బాడి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేజీబీవీ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధహక్కులు కల్పిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో జీతాల పెంపుదలకు అతిగతి లేదన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకనగుణంగా కార్మికుల వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల విద్యాభివృద్ధి కోసం కాలేజీలు అప్గ్రేడ్ చేయడం సంతోషించదగిన విషయమే అయినప్పటికీ, అందుకు అనుగుణంగా నాన్ టీచింగ్ వర్కర్స్ ను నియమించకపోవడం వల్ల ఉన్న వర్కర్స్ మీదనే అధిక పనిభారం పడుతుందని అన్నారు, కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకిరి చేపిస్తూ వేతనాలు పెంచకుండా ఉండడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శ్రమ దోపిడీకి నిదర్శనం అన్నారు. గత సంవత్సరం నియమించిన నాన్ టీచింగ్ వర్కర్స్ కు ఈరోజుకు వారు చేస్తున్న పనికి వేతనాలు ఇవ్వకపోవడం సరియైనది కాదు అని అన్నారు. కొంత మందికి గత 18 నెలల గా పెండింగ్ ఉన్న వేతనాలు,వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న ఖమ్మం లోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో టి యూ సి ఐ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నామని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచే విధంగా, ఈ పి ఎఫ్ , ఈ యస్ ఐ వంటి హక్కుల అమలుచేయాలని ఇంకా సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటా కర్తవ్యాలను చర్చించి భవిష్యత్ కార్యకలాపాల రూపొందించుకొని పోరాటాలకు సిద్ధంగా చేయడానికి కాంటాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై ఈ జనరల్ కౌన్సిల్ ను, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె జీ బి వి నాన్ టీచింగ్ నాయకురాలు సిబ్బంది అరుణ, లక్ష్మీ శిరీష,సునీత,రమాదేవి,స్వరూప, స్రవంతి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!