పత్రిక స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభకాంక్షలు -పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026: ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటాము. 1993లో ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రకటించింది. 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛ కోసం చేసిన ప్రకటనకు గుర్తుగా ఈ రోజును ఎంచుకున్నారు. పత్రికా స్వేచ్ఛ అంటే ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిడి లేకుండా, భయం లేకుండా వార్తలను సేకరించి, ప్రచురించే హక్కును పత్రికలకు కల్పించడమే పత్రికా స్వేచ్ఛ అని శంకర్ గౌడ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. నిజాలను ప్రజల ముందు ఉంచడం, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, సమాజంలో జరిగే అన్యాయాలను బయటపెట్టడం పత్రికల బాధ్యత అన్నారు. స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం బతకదు. ప్రజలకు నిజాలు తెలిస్తేనే సరైన నిర్ణయాలు తీసుకోగలరు. కుంభకోణాలు, అక్రమాలు బయటపడేది పత్రికల వల్లే. బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించేది పత్రికలే అన్నారు. ఇప్పుడు జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులూ, ఫేక్ న్యూస్, సెన్సార్‌షిప్ ఎక్కువైపోయాయి. చాలా దేశాల్లో నిజం రాసినందుకు జైలుకు వెళ్తున్నారు. డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం కేవలం జర్నలిస్టుల పని కాదు. ప్రజలుగా మనం నిజమైన వార్తలను చదవాలి, ఫేక్ న్యూస్‌ను నమ్మకూడదు. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు అండగా నిలబడాలి అన్నారు. పత్రికా స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ. అది ఉంటేనే మన గొంతు వినిపిస్తుంది. ప్రజల పక్షనా నిలబాడే ప్రతి జర్నలిస్ట్ కు పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం శుభకాంక్షలు తెలిపారు.
