ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఎన్నికల ఫలితాలపై బిజెపి నాయకుడు మున్నూరు రవీందర్

 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026:

దేశంలో మరోసారి కాకలేపిన “కమలం”, తెలంగాణలో వచ్చేది బిజెపి పాలన, కాలగర్భంలో కమ్యూనిస్టులు వామపక్షాలకు దేశంలో చోటు లేదు, 100 సంవత్సరాల కమ్యూనిస్టులకు దేశ ప్రజలు చుక్కలు, దేశంలో చెక్కు చెదరని మోడీ చరిష్మా!!, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు!!

దేశంలో ఏ ఎన్నిక వచ్చిన ఫలితం బిజెపి పార్టీకి సొంతమని. ఈ విషయం దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రజలు భారతీయ జనతా పార్టీకి వరుసగా పట్టం కట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని చెప్పడంలో సందేహం లేదని వనపర్తి జిల్లాకు చెందిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ అన్నారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధిస్తూ కమ్యూనిస్టు పార్టీ కంచుకోటలో బిజెపి కమలం కాక లేపిన సంగతి గుర్తు చేశారు. ఈ దేశంలో కమ్యూనిస్టుల విధానాలు సరిపోవని, కాలం చెల్లిపోయాని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి గుర్తు చేసుకోవాలని జ్యోతి బస్ 1977 నుండి 2000 సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా పని చేశారని ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచారి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ను పరిపాలమించిన కమ్యూనిస్టుల పాలన పట్ల వ్యతిరేకత ప్రజల్లో రావడంతో, 2011 సంవత్సరంలో టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ కమ్యూనిస్టు పార్టీ దురాగత పాలనను అంతం చే సి అధికారం రావడం సంతోషకరమైన విషమైన అయిన కూడా, ఆమె పాలనలో 15 సంవత్సరాలు ఆ రాష్ట్ర ము అధోగతి పాలన కావడము దురదుష్టకరము. అందుకే ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటి ఇవ్వడము జరిగింది. ఆ రాష్ట్ర ప్రజలకు బిజెపి పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకు మున్నూరు రవీందర్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకు ఈ దేశంలో హిందూ సమాజం చైతన్యం అయిందని హిందూ ధర్మం జాతీయవాదం బలపరుస్తుందని చెప్పడంలో సందేశం లేదని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎందుకు నిదర్శమని అన్నారు. తుప్పు పట్టిన ఎల్ డి ఏ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీలకు ఈ దేశంలో కాలం చెల్లిందని అన్నారు. లెఫ్ట్ డెమొక్రటిక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ , వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీలకు భారతదేశంలో మరో 30 సంవత్సరాల అవకాశం లేదని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం ఉగ్రవాదులను అన్సీ వేస్తూ ఈ దేశ ప్రజలను సురక్షితంగా కంటికి నిద్ర పోయే విధంగా 24 గంటలు కంటికి రెప్పలాగా కాపాడుతున్న భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర క్యాబినెట్ మంత్రులు రక్షణ శాఖ అధికారులు కీలకపాత్ర పోషిస్తూ ఈ దేశాన్ని కాపాడుతున్న విషయం గుర్తు చేశారు. దేశ మొత్తం కాషాయమయం అయ్యిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని బిజెపి పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు న్యాయవాది మున్నూరు రవీందర్ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిగా మోడీ పరిపాలన వల్ల ఈ దేశం శాంతి భద్రతలో సురక్షితంగా ఉన్న విషయం కూడా ప్రజలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు అందుకే ఈ ఎన్నికల ఫలితాల్లో బిజెపికి ప్రజలు పట్టం కట్టినట్లు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో చెక్కుచెదరకుండా మోడీ చరిష్మా ఈ దేశంలో నేటికీ కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలకు ప్రజలు మోసపోయిన కూడా తిరిగి రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగర వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

Related Articles

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వివిధ పార్టీల నేతలుపొలిటికల్.పవర్ సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్.9టీవీన్యూస్వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్ 17.2026. వనపర్తి జిల్లాకొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గల కీర్తిశేషులు మాజీ...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్లు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డిపోలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగుదినపత్రిక ...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,–  కొత్తకోట ఎస్సై. విక్రమ్, భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.12.2026.వచ్చే...
error: Content is protected !!