ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పెదమ్మ బొడ్రాయి పండుగలో పాల్గొన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 05 మే 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు పెదమ్మ బొడ్రాయి పండుగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే ఈ సందర్భంగా గడ్డపార బుచన్న బ్రదర్స్ మరియు వారి కుమారులు గ్రామాభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చిన హైమాక్స్ లైట్స్‌ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా ప్రారంభించి (ఓపెన్ చేసి) గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దాతలను అభినందిస్తూ, గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోతుల రామ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రాములు, శేఖర్ గౌడ్, బుచన్న నర్సింహ గౌడ్, ఆనంద్ రెడ్డి, కొమ్ములయ్య, బాలరాజు, శ్రీకాంత్ రెడ్డి, బి అర్ ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!