ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*ప్రియుడి కోసం రూ.12 లక్షల సుపారీ.. భర్త హత్యకు భార్యే మాస్టర్ ప్లాన్!*

పొలిటికల్ పవర్ సమగ్ర దినపత్రిక తెలుగు PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 17న హత్యకు గురైన వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు కేసులో భార్యే ప్రధాన నిందితురాలిగా తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది.


పోలీసుల వివరాల ప్రకారం.. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సులేమాన్ రాజు తరచూ భార్యను ప్రశ్నిస్తూ వేధించడంతో, అతడిని అడ్డు తొలగించాలనే కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రియుడితో కలిసి భర్త హత్యకు రూ.12 లక్షల సుపారీ ఇచ్చిన దుర్గామణి, పక్కా ప్రణాళికతో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును గొంతు నులిమి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో పడేసినట్లు గుర్తించారు.

కేసుపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికల ఆధారంగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి కారు, సెల్‌ఫోన్లు, నగదు, ఛార్జింగ్ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు.

భార్యే ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన ఘటన ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం

  తొస్సిపూడిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పర్యటన జెడ్పీటీసీ అభ్యర్థి...

వర్షంలో ఆకలితో ఉన్నవారికి JSPW అన్నదానం

ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్లపై నిరుపేదలు, ప్రయాణికులకు ఆహారం పంపిణీ ...

తొమ్మిదేళ్లు దోసుకొన్న దొంగలు మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరా..

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం విలేకరుల సమావేశంలో మంత్రి...

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై...

Related Articles

మహబూబాబాద్‌లో ‘డ్రగ్స్ రహిత సమాజం’ కోసం పోలీస్ శాఖ భారీ 5కే రన్!  * “Say No to Drugs” నినాదంతో రోడ్డెక్కనున్న పౌరసమాజం!

* నవంబర్ 7 (శనివారం) ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభం!* యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పిలుపు!గార్ల (పొలిటికల్ పవర్ న్యూస్ -...

డ్రైనేజీ బీభత్సం: మురుగుకూపంలో ‘కాకతీయ నగర్’!  * వారం రోజులుగా రోడ్లపై పారుతున్న మురుగునీరు!  * శోభా డైరీ ఫామ్ పశువుల పేడ కలవడంతో మరింత దుర్గంధం!  *...

మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్ - ఉపేందర్ కూరెళ్ళ):మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి 9వ డివిజన్ ‘కాకతీయ నగర్’ కాలనీవాసుల పరిస్థితి తీవ్ర వర్ణనాతీతంగా మారింది. గత వారం...

ఉచిత గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకేంద్రాన్నిప్రారంభించినమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణా గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిది:ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదు ప్రక్రియలో భాగంగా ఇల్లందు శాసనసభ్యులు శ్రీ...
error: Content is protected !!