ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

 

*రైతు ముంగిటకే రెవెన్యూ సేవలు. బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి.* పొలిటికల్ పవర్9టీవీ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కాసినాయన మండలం గంగనపల్లె గ్రామంలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ‘ఒక నెల – ఒక గ్రామం – నాలుగు పర్యటనలు’ అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ భూ సమస్యల పరిష్కార వేదికలో రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి* హాజరయ్యారు. గ్రామస్తుల నుంచి, రైతుల నుంచి వినతులను స్వయంగా స్వీకరించిన ఆయన, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

అనంతరం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధాన లక్ష్యం అన్నారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు.అధికారులు నేరుగా గ్రామాలకే వచ్చి సమస్యలను పరిష్కరించడం వల్ల రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అమర్నాథ్ రెడ్డి, విఆర్ఓ శ్రీనివాసులు, సర్వేర్, స్థానిక టిడిపి నాయకులు కృష్ణారెడ్డి, రోసి రెడ్డి,పీరవలి, అల్లా ప్రకాష్,క్రిష్ణయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!