మట్టా జయంతి గౌడ్ కు బీజేపీ సభ బయపడిందా…!
మోడీ లాంటి పీఎం వస్తే కుల నాయకుల అరెస్ట్ లేంటి…!?
కుల సంఘాలు లేనిదే బీజేపీ గెలిచిందా…!?
మోడీ చేతకాని పాలన చేస్తున్నాడని ఒప్పుకున్నట్టా…!?
కనీసం కాల కృత్యాలు తీర్చుకోకుండానే తీసుకువచ్చి పోలీస్ స్టేషన్
మేము అడ్డుకుంటామని పిలుపు నివ్వలేదే….!?
మట్టా జయంతి గౌడ్…
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో: మే 10 2026. : నేడు లక్ష మందితో భారత ప్రధాని మోడీ సభ అట్టహాసంగా నిర్వహించడం ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల హోలాహలం ఇదంతా రాష్ట్ర అభివృద్ధిలో దేశం అడుగులలో వారి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారంలో భాగం. కానీ బీసీ మహిళలకు 50%రిజర్వేషన్ కల్పించాలని అడిగిన తప్పిదానికి బిసి మహిళా నాయకురాలిగా ఐదు రోజుల నిరాహార దీక్ష చేసిన ఒక మహిళా నాయకురాలైన నన్ను నిర్భందించటం సిగ్గుచేటు చర్య. ఎందుకంటే నేను లేదా మా తోటి నాయకులు మోడీ సభను అడ్డుకుంటామని పిలుపునిస్తే అరెస్ట్ చేయటంలో అతిషయోక్తి లేదు కానీ అస్సలు ఆ సభ గురించి కనీసం పట్టించుకోని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కనీసం కాల కృత్యాలు తీర్చుకోకుండానే తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టటం అంటే మోడీయే కాదు.. బీజేపీ పార్టీకి నేనంటే అంతభయం పుట్టిందా అనే ప్రశ్న లేవనేత్తింది. కాబట్టి మోడీయే కాదు ఇకపై బీజేపీ ఏ కార్యక్రమం నిర్వహించిన అడ్డుకుంటామని బల్లగుద్ధి ఈ సందర్బంగా బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం.
