ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*_ఏంటి విజయ్ ఈ స్పీడ్.. తమిళనాడు సీఎంగా డ్యూటీ ఎక్కిన కొన్ని గంటలకే.._*

_చెన్నై: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే జోసెఫ్ విజయ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. సమర్థులైన ఐఏఎస్ అధికారులను తన పక్కన పెట్టుకోవాలని సీఎం విజయ్ నిర్ణయించుకున్నారు._

_తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ డా. పి. సెంథిల్‌కుమార్ను ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి-I గా బదిలీ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంంటే.. ఐఏఎస్ సెంథిల్ కుమార్ను తన కార్యదర్శిగా నియమించుకుని ఆయనకు విజయ్ కీలక బాధ్యతలు అప్పగించారు._

 

_ప్రభుత్వ ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ జి. లక్ష్మీ ప్రియ కూడా బదిలీ కావడం గమనార్హం. ఆమెను ముఖ్యమంత్రి కార్యదర్శి-II గా నియమించారు. విజయ్ స్పీడ్ చూస్తుంటే.. ఒకేఒక్కడులో అర్జున్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి/కార్యదర్శి-I పదవి, ముఖ్యమంత్రికి కార్యదర్శి-II పదవి, ఐఏఎస్ (పే) రూల్స్, 2016 షెడ్యూల్ II-Aలో పేర్కొనబడిన “ప్రధాన కార్యదర్శి”, “సహకార సంఘాల రిజిస్ట్రార్” కేడర్ పోస్టులతో హోదా, బాధ్యతల పరంగా సమానమైనవని ప్రభుత్వం ప్రకటించింది._

 

_సీఎం అయిన గంటల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను తన కార్యదర్శులుగా నియమించుకుంటూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ స్పీడ్ చూస్తుంటే.. తమిళనాడులో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు._

 

_తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మంత్రులకు శాఖల విషయంలో కూడా ఇప్పటికే సీఎం విజయ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే.. ఇంత త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ విజయ్ తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారారు._

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!