ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మిషన్ భగీరథ నీటి సరఫరాపై సర్పంచ్ పర్యవేక్షణ 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 10 2026: పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు సక్రమంగా అందుతున్నదా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 10, 11 వార్డులను సందర్శించి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ఇళ్ల వద్ద ఉన్న మిషన్ భగీరథ నల్ల కలెక్షన్‌కు సంబంధించిన వాచర్లు తొలగించబడిన చోట వాటిని వెంటనే సరిచేసుకోవాలని ఇంటి సభ్యులకు సూచించారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మరియు గ్రామస్తులకు సూచనలు చేశారు. అదేవిధంగా ఇంటి ఆవరణల్లో ఉన్న పూల మొక్కలకు అధికంగా నీళ్లు పోయడం వల్ల గ్రామంలో నీటి సమస్య తలెత్తే అవకాశముందని తెలిపారు. అందువల్ల నీటిని వృథా చేయకుండా తగిన జాగ్రత్తతో వినియోగించాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు ఎస్. రాములు, వాటర్ మెన్ గొల్ల సోమయ్య, బోయిని కృష్ణయ్య, మందడి బందేన్న తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!