ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వడ్డెర బిడ్డ శిరీష ను చంపిన సైకో మణిదీప్ కు ఉరిశిక్ష విధించాలి

 జాతీయ వడ్డెర సంఘం డిమాండ్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సూర్యపేట జిల్లా బ్యూరో

కోదాడ పట్టణంలో నడిరోడ్డుపై వడ్డెర బిడ్డ శిరీషను ఇతర కులానికి చెందిన సైకో భర్త మణిదీప్ అత్యంత కిరాతకంగా పొడిచి పొడిచి చంపడం అత్యంత దారుణమైన విషయం….

 

ఈ విషయం రాత్రి స్థానిక కోదాడ నాయకులు గుంజే సైదులు, బత్తుల ఉపేందర్ జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ కి ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది…

 

ఇట్టి విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు శివకుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదు నుండి జాతీయ నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం హుటాహుటిన 6 కార్లలో కోదాడ పట్టణానికి రావటం జరిగింది…

 

అదేవిధంగా జాతీయ వడ్డెర సంఘం నాయకులు సూర్యాపేట జిల్లా నుండి మరియు ఎన్టీఆర్ జిల్లా నుండి కూడా రావటం జరిగింది….

 

రెండు రాష్ట్రాలనుండి వచ్చిన జాతీయ సంఘం నాయకులు స్థానిక నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి శిరీషను చంపిన సైకో మణిదీప్ అనే వాన్నీ వెంటనే ఉరితీయాలని లేదా ఎన్కౌంటర్ చేసి చంపేయాలని పట్టుబట్టడం జరిగింది….

 

దానికి పోలీసులు స్పందిస్తూ కచ్చితంగా వాడికి శిక్ష పడుతుందని, అందరూ కూడా చట్టానికి లోబడి ఉండాలి కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సంయమనం పాటించండి అని నాయకులకు రిక్వెస్ట్ చేయటం జరిగింది….

 

అనంతరం పోలీసులు సీఐ తో జరిగిన చర్చల్లో చట్టం వాడికి కచ్చితం గా శిక్ష విధించేటట్టు అన్ని తయారు చేశామన్నారు…

 

శిరీష కు వున్న బాబు కు మణిదీప్ కు వున్న మొత్తం ఆస్తి 360 గజాల జాగా, మరియు ఇల్లు చిన్న అబ్బాయి పేరిట రాయించటం జరిగింది….

అలాగే శిరీష కు సంబంధించిన వారు ఎవరు లేనందున, అబ్బాయికి 18 సంవత్సరాలు వచ్చే వరకు శిశు సంక్షేమ శాఖ వారు బాధ్యత తీసుకుని చదివించి పెంచి పెద్ద చేయాలని తెలియచేయటం జరిగింది….

అనంతరం జాతీయ వడ్డెర సంఘం నాయకులు శిరీష చావు ఖర్చుల నిమిత్తం 10,000/- శిరీష బంధువులకు ఇవ్వటం జరిగింది…

అనంతరం స్థానికులు మాట్లాడుతూ జాతీయ వడ్డెర సంఘం నాయకులు వచ్చినందువల్లే ఈ పరిష్కారం లభించిందని లేదంటే ఎవ్వరు కూడా పట్టించుకునే వారు లేక ఈ కేస్ క్లోజ్ అయిపోయేదని అన్నారు..

సమస్య చెప్పగానే సత్వరం స్పందించిన జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ అన్న గారికి రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ అన్న గారికి మరియు ఇక్కడ కోదాడ కు వచ్చిన జాతీయ వడ్డెర సంఘం రెండు రాష్ట్రాల నాయకులకు కోదాడ వడ్డెర సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు..

 

Latest Articles

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!