ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

🔥 *‘షాడో’ రాజ్యం నుంచి జర్నలిస్టుపై దాడి వరకు: రాజారంలో బెదిరింపుల పర్వం*

*‘నేనే ఉపసర్పంచ్’ అంటూ తాపీ మేస్త్రి హల్‌చల్.. బచ్చోడులో జర్నలిస్టుకు హత్య బెదిరింపు*

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

*‘అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా’.. వీడియో ఆధారాలు బయటపెడతానని జర్నలిస్ట్ వెల్లడి*

✍️ *రాజారం, తిరుమలాయపాలెం:*

ఖమ్మం జిల్లా రాజారం గ్రామంలో ‘షాడో’ పాలన రాజ్యమేలుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉపసర్పంచ్ భర్త, వృత్తిరీత్యా తాపీ మేస్త్రి, “నేనే ఉపసర్పంచ్‌ని, నేను చెప్పిందే జరగాలి” అంటూ గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. “ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లు కూడా నేనే కట్టాలి” అంటూ ‘ఫైల్ మాన్’ అవతారమెత్తి లబ్ధిదారులను బెదిరిస్తున్నాడని, ప్రశ్నించిన వారికి “అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా” అంటూ బహిరంగ హత్యా బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామకంఠం భూమిలో అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం చేపట్టగా, ఆర్టీఐ ద్వారా ధ్రువపత్రాలు కోరిన ఓ జర్నలిస్టుపై సదరు వ్యక్తి కక్ష కట్టినట్లు తెలుస్తోంది. “కమిషన్ ముట్టజెప్తే చాలు, చట్టం నా జేబులోనే” అంటూ గ్రామకంఠం భూములు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నాడని, అడిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణంపై వార్త రాసిన జర్నలిస్టును బచ్చోడు గ్రామంలో అడ్డగించి సదరు వ్యక్తి బెదిరింపులకు దిగాడని బాధిత జర్నలిస్టు వెల్లడించారు. బచ్చోడులోని మద్యం దుకాణం వద్ద మద్యం సేవించి, రోడ్డుపై వెళ్తున్న తనను అడ్డగించి, “మా ఊరు రావడానికి నీకు ఏం హక్కు ఉంది? వార్త ఎందుకు రాశావ్? మా ఊరు వార్తలు రాస్తే చంపేస్తా” అని బెదిరించాడని, సమాచారం ఇచ్చిన గ్రామస్తులపై ఇష్టానుసారంగా బూతులు తిట్టాడని, తనపై దాడికి ప్రయత్నించాడని జర్నలిస్టు ఆరోపించారు. “నేనే ఉపసర్పంచ్. దమ్ముంటే సమాచారం ఇచ్చిన వాళ్లను వార్డు మెంబర్‌గా గెలిపించుకో” అని సదరు వ్యక్తి రెచ్చిపోయాడని జర్నలిస్టు తెలిపారు. మూఢనమ్మకాల పేరు చెప్పి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, కులాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నాడని స్థానికులు తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారని జర్నలిస్టు అన్నారు. తనను బెదిరించిన, దుర్భాషలాడిన, దాడికి యత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని బాధిత జర్నలిస్టు స్పష్టం చేశారు. “భర్త పెత్తనం, భార్య పదవి – రాజారంలో ప్రజాస్వామ్యం ఖూనీ” అంటూ గ్రామస్తులు నినదిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గం ఈ ‘షాడో’ దందాకు వత్తాసు పలుకుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి బెదిరింపులకు పాల్పడుతున్న ఈ ‘ఫైల్ మాన్’పై క్రిమినల్ కేసు నమోదు చేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని జర్నలిస్టు సంఘాలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!