ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కరెంటు షాక్ నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలి.

 

 *నెల రోజులుగా హై ఓల్టేజ్ కరెంట్ వలన షాట్ సర్క్యూట్ జరుగుతున్న పట్టించుకోని అధికారులు.*

 హై ఓల్టేజ్ కరెంట్ కారణంగా గతం లో ఇద్దరి ప్రాణాలు బలి.

 తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) జిల్లా కార్యదర్శి — ఎర్మ పున్నం

మే 21 :

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు పత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

హై ఓల్టేజ్ కరెంట్ వలన షాట్ సర్క్యూట్ నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) ఆద్వర్యం లో లైన్ మెన్ శ్రీదర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం లోని రొయ్యలపల్లి గ్రామంలో నీ గొల్లవాడలో పాత ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించి కొత్త దానిని ఏర్పాటు చేశారు, అప్పటి నుండి హై ఓల్టేజ్ కరెంట్ సరఫరా అవుతుంది, వెర్తింగా సరిగ్గా లేకపోవడం వలన నేల రోజులుగా షాట్ సర్క్యూట్ జరుగుతుంది, దాని వలన త్రాగునీటి మోటార్లు కాలిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలని కరెంట్ అధికారులకు విన్నవించడం తో తాత్కాలిక పరిష్కారం చేశారు కానీ శాశ్వత పరిష్కారం చేయలేదని అన్నారు. గతం లో ఇలాంటి షాట్ సర్క్యూట్ వలన గ్రామంలో ఇద్దరు చనిపోయారని అన్నారు. అలాంటి ప్రమాదాలు జరగకముందే తగు జాగ్రతలు తీసుకొని శాశ్వత పరిష్కారం చేయాలని అన్నారు. లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కోర్తే సమ్మయ్య, గ్రామస్తులు కొండగుర్ల రాజన్న, జిమిడే రాజమల్లు, కోట సురేష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!