ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కొత్త బసాపురంలో దాహం కేకలు…!

 బిందెలు చేతపట్టి చేతిపంపుల వద్ద క్యూ కడుతున్న మహిళలు

పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ వై యస్ ర్ కడప జిల్లా యం వెంకటేష్

*రెండు నెలల నుండి మోటార్ చెడిపోయిన పట్టించుకోని పంచాయతీ అధికారులు*

బ్రహ్మంగారిమఠం మండల సమీపంలో ఉన్నటువంటి కొత్త బసాపురం గ్రామంలో రెండు నెలల క్రితం గ్రామంలో ఉన్నటువంటి మోటర్ చెడిపోవడంతో నీటి కోసం ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

ఇంటిముందే కుళాయికి రావలసిన నీళ్లు రాకపోవడంతో చేతిపంపుల వద్ద బిందెలతో మహిళలు క్యూ లో నిలబడి నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు ప్రభుత్వ కార్యాలయానికి పరిమితమై, నెలనెలా జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసారు అంటూ మహిళలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!