ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఐపీఎల్ టికెట్ల కోసం కొట్టుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు పోటీ పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు

 

టికెట్ల కోసం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్ చేసి, ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి

 

ప్రతీ మ్యాచ్‌కు మంత్రులకు రెండు టికెట్ల చొప్పున ఇవ్వాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి తెలపగా.. అయితే చివరి మ్యాచ్ కావడంతో తమకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటూ శ్రీహరికి ఫోన్ చేసి ఒత్తిడి పెంచుతున్న మంత్రులు

 

ఐపీఎల్ టికెట్ల పంపిణీ జరుగుతున్నదని తెలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు మంత్రి వాకిటికి, పేషీలోని స్టాఫ్‌కి ఫోన్ చేసి మంత్రులకే టికెట్లు ఇస్తారా? వాళ్లే కాంగ్రెస్ పార్టీ లీడర్లా? మేం కాదా? మాకు ఎందుకు టికెట్లు ఇవ్వరు? అని నిలదీస్తుండటంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది

 

అయితే నేరుగా హెచ్ సీఏ ప్రతినిధులకు ఫోన్ చేసి మాకు టికెట్లు ఎందుకు ఇవ్వరు? పని ఉన్నప్పుడు పదే పదే ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ్యట్లేదు? ప్యూచర్‌లో మా వద్దకు పని కోసం రారా? అని బెదిరిస్తున్న సీనియర్ బ్యూరోక్రట్స్, పోలీస్ అధికారులు

 

దీంతో ఎవరికి న్యాయం చేయాలో తెలియక తలపట్టుకున్న మంత్రి వాకిటి

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!