ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మత్తు ముఠాపై పోలీసుల దెబ్బ

ప్రెస్ మీట్‌లో బయటపడ్డ నిజాలు

300 కిలోల గంజాయి స్వాధీనం

అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ బట్టబయలు

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 23)

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీ గంజాయి రవాణా ముఠాను ఛేదించారు. జిల్లా పోలీసు అధికారి రోహిత్ రాజు ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ సతీప్ కుమార్ సూచనల మేరకు అశ్వారావుపేట పోలీసులు, ప్రత్యేక దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1.50 కోట్ల విలువైన 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ సతీప్ కుమార్, సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై రాజు కేసు వివరాలను వెల్లడించారు. వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ఆపి పరిశీలించగా గంజాయి రవాణా వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీల్లో మారుతి బాలెనో కారులో ఐదు ప్యాకెట్లు, టాటా లారీలో ప్రత్యేక రహస్య గదిలో 25 ప్యాకెట్లు గుర్తించినట్లు వెల్లడించారు. మొత్తం 30 ప్యాకెట్లలో 300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన నాలుగు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలుబ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధితమ అనుభవంలో ఉన్న భూములకు తక్షణమే రక్షణ కల్పించాలని, పాస్‌పుస్తకాలు మంజూరు చేసి ఆన్‌లైన్ చేయాలని...
error: Content is protected !!