పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ధర్మపురి భవానీ నియామకం.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
ఖమ్మం.. తిరుమలాయపాలెం..
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన ధర్మపురి భవాని ని పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ అను జాతీయ సంస్థ లో మహిళా జాతీయ అధ్యక్షురాలుగా నియమితులు అయినారు ఈ సందర్బంగా నాపై నమ్మకంతో నన్ను జాతీయ మహిళా అధ్యక్షులురాలుగా నియమించిన సంస్థ వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు కి ధన్యవాదములు తెలియజేస్తూను.. మా సంస్థ భారత ప్రభుత్వ కమీషన్స్ ద్వారా పేద ప్రజలకి న్యాయం చేస్తుంది అని భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమీషన్స్ ఎస్ స్సీ , ఎస్టి , బీసీ , మైనారిటీ మరియు మహిళా కమీషన్స్ ద్వారా వారి సమస్యల పట్ల మా సంస్థ సామజిక న్యాయం అందించడం లో ముందుంటాం.. అలాగే మహిళల పై జరిగే అన్యాయల పట్ల, వారి హక్కులకి భంగం కలిగిన అలాగే మహిళా భద్రత, విద్య, వైద్యం పట్ల వారి హక్కుల సాధనకై నా వంతుగా కృషి చేస్తానని నాకు ఇంత అవకాశం ఇచ్చిన సంస్థ వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను..

