ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

 

జూన్ 3

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్ర పూర్ సమీపంలో బొమ్మరిల్లు బిర్యాని పాయింట్ లో ఉరివేసుకొని కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్ అనే 41 సంవత్సరాల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతుడు గత కొంతకాలంగా ఆన్లైన్ గేమ్ లో అలవాటు పడి సుమారు 10 లక్షల వరకు వివిధ వ్యక్తుల వద్ద అప్పులు వివిధ లోన్లు తీసుకున్నాడు. నిన్న ఒక లోను సంబంధించిన వ్యక్తి వచ్చి తన లోన్ డబ్బులు చెల్లించాలని నిలదీశాడు. రేపు కడతానని నచ్చజెప్పి పంపించాడు. లోన్ వ్యక్తి వచ్చి వెళ్ళినప్పటి నుండి దిగులుగా ఉంటూ తన భార్యతో అప్పుల వాళ్ళు ఆగడం లేదు అప్పులు తీర్చడం ఎలా అంటూ బాధపడితే కుటుంబ సభ్యులు ఓదార్చి పడుకున్నారు. ఈరోజు ఉదయం హోటల్ కి వెళ్లి చూసే సరికి హోటల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సునారికారి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.ఎస్సై గొపతి సురేష్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!