ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపార్టీ బలోపేతానికి బిఎల్ఏ లు వారదులుగా పని చేయాలి

పార్టీ బలోపేతానికి బిఎల్ఏ లు వారదులుగా పని చేయాలి

📰 Generate e-Paper Clip

డబుల్ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి -ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 09 2026: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బిఎల్ఏ లు వారదులుగా పని చేయాలని ఒక్కో బిఎల్ఏ 1000 మందితో సమానమని, క్షేత్రస్థాయిలో బిఎల్ఎ ల పాత్రని కీలకంగా ఉంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని ఆర్ జి గార్డెన్స్ లో నిర్వహించిన బిఎల్ఏ ల శిక్షణ కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొననున్నారు.

ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మీ అభిమానంగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారని అలాంటి వారి ఓట్లను గుర్తించాలని వారి ఓట్ల గుర్తింపులో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలో మొత్తం 316 మంది బిఎల్ఏ లు ఉన్నారని వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. డబల్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు బిఎల్ఏ గ్రామాల్లోని ఓటర్ లిస్ట్ లను పరిశీలించి డబుల్ ఓట్లను గుర్తించాల్సిందిగా ఆయన సూచించారు. ప్రతిపక్షాలకు ఎక్కడ తావివ్వకుండా ప్రతి ఓటర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. మన పరిధిలో జరిగే కాంగ్రెస్ పార్టీ పరమైన సమావేశాలకు బిఎల్ఏ లు తప్పకుండా హాజరు కావాలన్నారు. మనకోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కాపాడుకోవాలని వారు మనల్ని ఎప్పటికీ కాపాడతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అందించ సంక్షేమ ఫలాలు పార్టీ సేవలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని, అధినాయకత్వాన్ని ముఖ్యమంత్రిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే ప్రతిపక్షాల ప్రచారాలను ఎక్కడికక్కడ ఖండించాలని ఆయన సూచించారు. మొన్న ఈమధ్య ఓ సినిమా నాయకుడు తెలంగాణ గురించి మాట్లాడాలని, ఆయన రాష్ట్ర రాజధాని నిర్మించుకునే పనులు చేసుకుంటే బాగుంటుందని పక్క రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో వనపర్తి లోని నాయకులు పెబ్బేరు సంత గుడులు చెరువులు కుంటలు అడ్డగోలుగా కబ్జాలు చేస్తూ కారు దిగితే గొడుగు పట్టుకుని ఫోజులిచ్చారే తప్ప ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకే జెండా కింద పని పనిచేస్తున్న మనం మనకు గుర్తింపునిచ్చిన పార్టీని ఎప్పటికీ మరువకూడదని ఎమ్మెల్యే సూచించారు.

మండలాధ్యక్షుల పదవి బాధ్యతల స్వీకరణ 

కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులుగా ఇటీవల నియమితులైన నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరినీ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఏ – 2 ఇంచార్జ్ శత్రు బుజ్జి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోళ్ల వెంకటేష్, శరవంద, చీర్ల జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, పట్టణ మండల అధ్యక్షులు, బిఎల్ఏ లు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!