ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో చిప్పకుర్తి శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం.
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రముఖ చిత్రకారులు, చిత్రకళా ఉపాధ్యాయులు, చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ఐన చిప్పకుర్తి శ్రీనివాస్ ను ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో జరిగిన ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈవో కళారత్న శ్రీ కత్తిమండ ప్రతాప్ శ్రీనివాస్ ను అభినందించి, ఆత్మీయ సన్మానం చేసారు. శ్రీనివాస్ తను చిత్రకళలో చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయం అని అన్నారు.శ్రీనివాస్ మాట్లాడుతూ నేను చేస్తున్న సేవలను గుర్తించి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి ఆత్మీయ సన్మానం చేసిన శ్రీశ్రీ కళావేదిక సీఈవో కత్తిమండ ప్రతాప్ కి మరియు ఈశ్వరీ భూషణం జాతీయ అధ్యక్షురాలు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. శ్రీనివాస్ కు పలువురు ప్రముఖులు, కళాకారులు అభినందనలు తెలిపారు…

