ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణజవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పచ్చి నిజం:-

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పచ్చి నిజం:-

📰 Generate e-Paper Clip

ఊపిరి పీల్చడమే ఓ శాపమా? స్కూల్ గోడలు ముద్దా?

 ప్రజల ప్రాణాలు ముద్దా?!

రామ్‌కీ ‘CSR’ వెనుక అసలు రహస్యం ఏంటి?:

కాలుష్యంతో ప్రాణాలు తీస్తూ… క్లాస్‌రూమ్‌లు కడితే సరిపోతుందా?

విషపు గాలుల జవహర్‌నగర్: లక్షలాది మంది ఆరోగ్యం ఫణంగా పెట్టి చేసే ‘మేకప్’ ఒప్పందాలు ఎవరి కోసం?

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ బాధితుల ఆక్రందన

మాకు కావాల్సింది కేవలం విద్య కాదు… అంతకంటే ముందు ‘ఆరోగ్య భద్రత’!

ఆలోచించండి… స్పందించండి! జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పొల్యూషన్‌పై కార్పొరేట్ మాయాజాలం నడుస్తోందా…?

మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ పొలిటికల్ పవర్ ప్రతినిధి ఏ పాండు రంగరావు:మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్*: కీసర సర్కిల్ జవహర్ నగర్ 

జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, కీసర తదితర ప్రాంతాల ప్రజలారా… ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి! 

​ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థలు (CSR కింద) కోట్లాది రూపాయల ఒప్పందాలు చేసుకోవడం స్వాగతించదగ్గ విషయమే. కానీ, ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే… ​రామ్‌కీ సంస్థ జవహర్‌నగర్‌లో తరగతి గదుల నిర్మాణం కోసం రూ. 19.66 కోట్లు (40% వాటా) ఖర్చు చేయడానికి ముందుకొచ్చింది. వినడానికి ఇది చాలా గొప్పగా ఉంది! కానీ నిజంగా ఇది సేవా? లేక ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించే ప్రయత్నమా?

మనల్ని వేధిస్తున్న పచ్చినిజాలు ఇవే:​

జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నాగారం, కీసర, మొదలగు తదితర ప్రాంతాలలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల సుమారుగా 9 నుండి10 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడి డంపింగ్ యార్డ్ వల్ల లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం నశించిపోతోంది.

చెడిపోయిన ఆరోగ్యం:

ఇక్కడి గాలి విషపూరితమైంది, భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

కార్పొరేట్ బాధ్యత ఎటు పోయింది?:

ఇన్నేళ్లుగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం పొల్యూషన్ వల్ల చెడిపోతుంటే పట్టించుకోని రామ్‌కీ సంస్థ. ఇపుడు సడన్‌గా పేదపిల్లల విద్య కోసం CSR ఫండ్స్ ఇస్తున్నామని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి?. “జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే” ​నిజమైన సేవ ఇక్కడ చేయండి. రామ్‌కీ సంస్థకు నిజంగా సేవ చేయాలనే గుణమే ఉంటే ఎక్కడో కాదు, కాలుష్యంతో నలిగిపోతున్న జవహర్‌నగర్, దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లోనే అత్యాధునిక ఉచిత విద్యాసంస్థలను, మౌలిక వసతులను స్వయంగా నిర్మించి నిర్వహించాలి. ​ఉచిత మెగా హెల్త్ క్యాంపులు మరియు సూపర్ స్పెషాలిటీ చికిత్స కాలుష్యం వల్ల ఇక్కడి ప్రజల ఆరోగ్యం ఎంత మేర క్షీణించిందో పరిశీలించడానికి ఉత్తమ వైద్యులతో నిరంతర హెల్త్ చెకప్స్ నిర్వహించాలి. బాధితులకు ఉచితంగా మందులు, కార్పొరేట్ స్థాయి చికిత్స అందించే బాధ్యతను ఈ సంస్థలే పూర్తిగా భరించాలి.

ప్రభుత్వాన్ని బుజ్జగించే ప్రక్రియ ఆపాలి:

కాలుష్య కారక లూప్‌హోల్స్ నుండి తప్పించుకోవడానికి, ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఇలాంటి ‘మేకప్’ ఒప్పందాలు కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల ప్రాణాలను కాపాడే ‘శాశ్వత పరిష్కారాలు’ చూపాలి. కేవలం స్కూల్ గోడలు కడితే సరిపోదు. ఆ స్కూళ్లకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆరోగ్యంగా బతికినప్పుడే ఆ విద్యకు సార్థకత ఉంటుంది. విషపు గాలులు పీలుస్తూ, రోగాల బారిన పడుతున్న జవహర్‌నగర్ ప్రాంత బాధితులకు పూర్తి స్థాయి ఆరోగ్య భద్రత కల్పించడమే నిజమైన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR). ​ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి చేసే ఏ ఒప్పందమైనా… ప్రజలను మోసం చేయడమే అవుతుంది అని డంపింగ్ యార్డ్ బాధితులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!