ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిగ్రామసభ ప్రజాస్వామ్యానికి పునాది వంటిది

గ్రామసభ ప్రజాస్వామ్యానికి పునాది వంటిది

📰 Generate e-Paper Clip

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11 2026: గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక గ్రామసభ కు గ్రామ సర్పంచ్ జ్యోతి గోపాల్ అధ్యక్షత నిర్వహించారు. ఇట్టి గ్రామ సభకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… జయన్న తిరుమలాపురం గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి గ్రామసభలు ఎంతో ఉపయోగపడతాయి అని అన్నారు. గ్రామాభివృద్ధికిగ్రామ ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం అని అన్నారు. గ్రామంలోని తాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలి అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి కృషి చేయాలని అన్నారు. గ్రామంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి కాబట్టి ప్రజలందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. గ్రామ ప్రజల సూచనలు, సలహాలు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకం అని అన్నారు. గ్రామ అభివృద్ధి పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. గ్రామంలో ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని, పంట పొలాల్లో ఎరువులను తగ్గించుకోవాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉందామని అన్నారు. ప్రజల విశ్వాసమే మా బలం. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. ప్రభుత్వం మరియు ప్రజలు కలిసి పనిచేస్తే గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని అన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండే గ్రామంగా జయన్న తిరుమలాపురాన్ని అభివృద్ధి చేస్తాం. మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నేను ఎల్లప్పుడూ నా అందుబాటులో ఉంటాను అని తెలిపారు. గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజల మద్దతు కోరుతూ ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా వేసిన సీసీ రోడ్లను చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, మండల వివిధ శాఖల అధికారులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!