ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిబిజెపి పాలనలో కష్టజీవుల బతుకు అధోగతి: సిపిఐ

బిజెపి పాలనలో కష్టజీవుల బతుకు అధోగతి: సిపిఐ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11 2026: బిజెపి 12 ఏళ్ల పాలనలో దేశం పరిస్థితి, కష్టజీవుల బతుకు అధోగతి పాలైందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెరిగిన ధరలకు నిరసనగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాన్ని సిపిఐ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. ధర్నా చౌక్ నుంచి నేతలు కార్యకర్తలు ఎర్రజెండాలు ఎర్ర షర్టులు ఎర్ర చీరలు ధరించి భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నారు. ముట్టడి సందర్భంగా నేతలు కార్యకర్తలు గేట్లు తోసుకొని లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటు వేసి అడ్డుకున్నారు. కార్యకర్తలు గేటు ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నచ్చజెప్పి తమ ప్రసంగాలను కొనసాగించారు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల క్రితం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విస్ బ్యాంకు నుంచు నల్లధనం తెచ్చి ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని, ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పైగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను భారీగా పెంచాలని ఫలితంగా రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు అంటాయని, సామాన్యుడు నిత్యవసర వస్తువులను కొని తినలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరలు తగ్గించాలని విపక్షాలు ప్రజలు గగ్గోలు పెడుతున్న పట్టించుకోవడం లేదని ధరలు తగ్గించే దాకా పోరాటం చేస్తామన్నారు. ధరల పెంపుతో సామాన్యుల కష్టాన్ని దోచి సంపన్నులకు సంపద పెంచుతున్నారని, కార్మిక చట్టాలను కాలరాచారని, వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి రైతుల కడుపు కొట్టేందుకు పూనుకున్నారని విమర్శించారు. రైతుల ఏడాది పోరాటంతో తోకమడిచి నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నారన్నారు. ప్రజల కనీస అవసరాల విషయంలో కూడా ప్రజలు పొదుపు పాటించాలని చెబుతున్న నరేంద్ర మోడీ రోజుకో దేశం తిరుగుతూ ప్రజాసమము దుర్వినియోగం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. దేశ సార్వభౌమత్వానికి చేటు తెచ్చే విధంగా ట్రంప్ కు భయపడుతున్నారు అన్నారు. తక్కువ ధరకు రష్యా చమురు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కొనవద్దని మోడీకి ట్రంప్ హుకుం జారీ చేస్తున్న బెదిరించలేని అసహయ స్థితిలో మోడీ ఉన్నారన్నారు. దేశభక్తి హిందూ మతం ముసుగులో ఇచ్చిన హామీల నుంచి ప్రజల సమస్యల నుంచి దృష్టి మరలచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు కనీస ఓటు హక్కును కూడా సర్ పేరుతో కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు గమనించి ప్రతిఘటించి బిజెపికి బుద్ధి చెప్పాలన్నారు. వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా నేతలు కళావతమ్మ, చంద్రయ్య, కృష్ణవేణి, గీత, మోష అబ్రహం, రాబర్ట్, శ్రీహరి, పృధ్వి నాదం, భాస్కర్, రవీందర్, డంగు కుర్మయ్య, వంక గోపాల్, గోపాలకృష్ణ, జయమ్మ, శ్రీదేవి, కురువమ్మ, డంగ్గు లక్ష్మి, శిరీష, ఎం.కురుమయ్య, పెంటయ్య, చిన్న నారాయణ, శివకుమార్, కాకం బాలస్వామి, లక్ష్మీనారాయణ, శ్యాంసుందర్, సహదేవుడు, కాశన్న, మహేష్, వెంకటమ్మ, శంకరమ్మ, కుతుబ్, వంశీ, ఎర్ర కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!