ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి 

📰 Generate e-Paper Clip

– ప్రతి చిన్నారి పాఠశాలలో ఉండాలి పనిస్థలాల్లో కాదు,

– అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన అవగాహన వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11.2026: బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, స్వేచ్ఛాయుత బాల్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ అన్నారు. అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ… బాల కార్మిక వ్యవస్థ పిల్లల బాల్యాన్ని, వారి భవిష్యత్తును దోచుకునే సామాజిక దురాచారం. ప్రతి చిన్నారి విద్యను అభ్యసిస్తూ ఆనందంగా ఎదిగే హక్కు కలిగి ఉన్నారు. బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారిని విద్యా ప్రవాహంలోకి తీసుకురావడానికి ప్రతి పౌరుడు సహకరించాలి. బాల కార్మిక రహిత సమాజ నిర్మాణమే నిజమైన అభివృద్ధికి నాంది. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండేలా అందరం బాధ్యతతో పనిచేస్తూ బాల్యాన్ని కాపాడి బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దామని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమశాఖ అధికారి.సుధారాణి, వనపర్తి జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు. చిన్నమ్మ తామస్,జిల్లా బాలల సంరక్షణ అధికారి. రాంబాబు, సఖి సెల్టర్ అడ్మినిస్టేటర్. కవిత తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి:...

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేతసెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేత   సెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!