ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలు వనపర్తి మార్కెట్లోకి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: పానుగల్ మండలం ఆకునోనిపల్లి గ్రామానికి చెందిన రైతు జూటూరు స్వామి సేంద్రియ ఎరువుల పద్ధతిలో పండించిన వంకాయలను స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతున్నారు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన కూరగాయల ఉత్పత్తికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం సేంద్రియ ఎరువులతో సాగు చేసిన వంకాయ పంట మార్కెట్లో అందుబాటులో ఉందని రైతు స్వామి తెలిపారు. గత రెండు నెలలుగా ఈ వంకాయలను వినియోగదారులకు అందిస్తున్నామని, మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన కూరగాయలను తక్కువ ధరకు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని కూరగాయలను కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఆదివారం వనపర్తి మార్కెట్లో పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రికతో మాట్లాడిన రైతు స్వామి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలు కొనుగోలు చేయాలనుకునే వారు రైతు జూటూరు స్వామిని 72888 11005 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Latest Articles

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!