ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అభినంధించిన పోలీస్ కమిషనర్

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అభినంధించిన పోలీస్ కమిషనర్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యర్ర నాగరాజు రెడ్డి చిన్నారులపై లైంగిక వేధింపులు పోక్సో కేసుల్లో, గంజాయి వంటి తీవ్రమైన ఎన్ డి పి ఎస్ కేసుల్లో బలమైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడం, ప్రాసిక్యూషన్, పోలీసుల సమన్వయంతో నేరం రుజువు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ… నేరస్థులకు జీవిత ఖైదు, ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష మొదలు అనేక కఠిన కారాగారా శిక్షలు పడేలా కృషి చేసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అయిన ఐదు పోక్సో కేసుల్లో ఖమ్మం అర్బన్ కేసు లో నిందుతుడికి జీవిత ఖైదు, రఘునాథపాలెం కేసులో ఇరవై ఏళ్ళు జైలు శిక్ష, ఖమ్మం రూరల్ రెండు వేర్వేరు కేసులో ఏడు, ఐదు సంవత్సరాల జైలు,రఘునాథపాలెం కేసులో మూడు సంవత్సరాల ఆరు నెలల శిక్ష పడ్డాయి. అదేవిదంగా గంజాయి వంటి 10 ఎన్ డి పి ఎస్ కేసుల్లో ఆరు కేసుల్లో ఇరవై ఏళ్ల కఠిన కారాగారా శిక్ష, మరో రెండు కేసుల్లో పది ఏళ్ల జైలు, ఒక కేసులో ఏడు ఏళ్ల జైలు, రెండు కేసుల్లో ఏడాది వరకు జైలు శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!