ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణతమిళనాడు రైతులపై సీఎం విజయ్‌ వరాల జల్లు

తమిళనాడు రైతులపై సీఎం విజయ్‌ వరాల జల్లు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ స్టేట్ బ్యూరో బాజా శేఖర్ జూన్ 17 2026: తమిళనాడు ప్రభుత్వం రైతులకు భారీ ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్‌ నాయకత్వంలోని ప్రభుత్వం సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాల మాఫీ పరిమితిని పెంచుతూ రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది.

ముఖ్యాంశాలు: సహకార బ్యాంకుల రుణమాఫీ పరిమితిని గతంలో ఉన్న రూ. 50,000 నుంచి రూ. 75,000 కు పెంచారు. రూ. 75,000 వరకు రుణం ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ వర్తించనుంది. రూ. 75,000 కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు రూ. 35,000 వరకు ఉపశమనం కల్పించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 14.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రుణమాఫీ అమలుతో ప్రభుత్వంపై సుమారు రూ. 5,932 కోట్ల ఆర్థిక భారం పడనుంది. 2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు సహకార బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడం, వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రకటనతో రాష్ట్ర రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!