ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నేడు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

నేడు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాదరావు కలసపాడు మండలం కడప జిల్లా: నేడు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద రైతులకు నిధులు విడుదల చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.కలసపాడు మండలంలో మొత్తం 6,165 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.3 కోట్ల 8 లక్షల లబ్ధిని పొందనున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద 5,680 మంది రైతులకు రూ.1 కోటి 14 లక్షలు విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా కలిపి మొత్తం రూ.4 కోట్ల 22 లక్షలు రైతుల ఖాతాల్లో నేడు జమ కానున్నాయని చెప్పారు. ప్రతి అర్హ రైతు ఖాతాలో పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 చొప్పున జమ అవుతాయని వివరించారు. రైతులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించి నిధులు జమ అయిన విషయాన్ని నిర్ధారించుకోవాలని మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!