ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిసొంత ఇల్లు అనేది ప్రతి పేద వాడికి స్వప్నం        

సొంత ఇల్లు అనేది ప్రతి పేద వాడికి స్వప్నం        

📰 Generate e-Paper Clip

– అలాంటి కలను సాకారం చేసింది మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం,

– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్  19. 2026.
సొంత ఇల్లు అనేది ప్రతి పేద వాడి స్వప్నం అని    అలాంటి కలను సాకారం చేసింది మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం    కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని  ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశకార్యక్రమాల్లోపాల్గొనిలబ్ధిదారురాలకు శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు (కొత్త బట్టలు) నూతన వస్త్రాలను బహుకరించారు.ఈసందర్భంలోదేవరకద్రఎమ్మెల్యేజి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ  ఇండ్లు  మంజూరు చేసి, ప్రభుత్వం తరుపున వారికి 5లక్షల ఆర్థిక సహాయం అందుతున్నందుకుచాలాసంతోషంగాఉందనిఅన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న కొత్తకోట అభివృద్ధిని పట్టించుకోలేదని, నిరుపేదలకు ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయలేదని ఎక్కడో ఊరికి ఆమడ దూరంలో డబ్బుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి వాళ్ళ కార్యకర్తలు కమిషన్ల కోసం కక్కుర్తి పడి వాళ్ళ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేశారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,పేదలకు ఇందిరమ్మ ఇండ్లు,అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు,రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ,పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, రైతులకు రుణమాఫీ, పండించిన పంటకు 500  బోనస్ వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మదనాపూరం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పల్లెపాగు ప్రశాంత్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి యాదవ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పాపయ్య గారి పల్లవి కృష్ణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, మాజీ జెడ్పిటిసి పి జె. బాబు,కిసాన్ రైతు సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సలీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శలు పి. కృష్ణారెడ్డి , ఎన్ జె. బో హెజ్, కొత్తకోట పట్టణ అధ్యక్షులు మేస్త్రి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు జె. అఖిల తండ్రి  సుభాష్, పుచ్చలపల్లి సుధ రామ్మోహన్ రెడ్డి, ఎన్ జే. బోయెజ్, భీమ చంద్ర కాంత్, రామ్ రెడ్డి, అస్మత్ ఖాన్ సలీం ఖాన్,కరాటే అబ్దుల్ నబి,  సర్పంచుల సంఘం అధ్యక్షులు మాసన్న,మాజీ కో ఆప్షన్ సభ్యులు జే యం.మిషేక్, మూలమల్ల వెంకటేశ్వర్ రెడ్డి, ముజీబ్, కొత్తకోట మైనార్టీ అధ్యక్షులు ఎజాస్ అలీ, మాజీ వార్డు సభ్యులు నరేంద్ర సాగర్, దేవరకద్ర అసెంబ్లీ అధ్యక్షులు ముస్తఫా, పి. రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మోహన్ రెడ్డి, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ బి. శివరాములు, అమడ బాకుల మాజీ సర్పంచ్ జి శ్యాంసుందర్ గౌడ్, ఫిషర్ మ్యాన్ సందా వెంకటేష్, సింగల్ విండో డైరెక్టర్, సర్పంచ్ రామ్ లాల్ నాయక్, బూత్కూర్ సర్పంచ్ బంగారయ్య,గోకరయ్య,సాయిల్ యాదవ్,మహమ్మద్ ఖలీల్, ఎండి. ఫెరోస్,  లతీఫ్, సుల్తాన్, భాస్కర్, రాములు యాదవ్, ముంత లక్ష్మయ్య యాదవ్, నా గబుచ్చన్న నాయుడు, భాస్కర్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!