పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 07 2026: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామం లో మంగళవారం నాడు ఉన్ని చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమీటీ లో 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని నూతన అధ్యక్షులు చింతల.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికైన సభ్యులను పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా అడిటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్ సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… చేనేత అనేది ఒక కళ. గ్రామ ఉన్ని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో, కార్మికులు తయారు చేసినటువంటి రగ్గుల ఉత్పత్తుల్లో, నైపుణ్యం అనుభవం గల చేనేత కార్మికులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు బాగానే ఉన్నాయని, కార్మికులకు ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్స్ స్కీము, రుణమాఫీ, నేతన్న భరోసా, వంటి ప్రభుత్వ పథకాల ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ఉన్ని చేనేత రగ్గులు దేశంలో ప్రతి మూలకు వెళ్తున్నాయని, చేనేత కార్మికులకు ఇతర ప్రదేశాలకు వలస వెళ్లకుండా, సొంత గ్రామంలోనే ఉపాధిిి కొనసాగిస్తున్నారని వారు తెలిపారు. రానున్న ఉన్ని చేనేత పారిశ్రామిక సహకార సంఘం, హైదరాబాద్ టేస్కో డైరెక్టర్ రేసులో ఉన్నానని, త్వరలో పొటి చేయనున్నట్లు తెలిపారు. నూతన డైరెక్టర్ గా ఎన్నికైన చింతల. వెంకటేశ్వర్లు, వనపర్తి అడిటర్ శ్రీనివాస్ కు, మరియు ఉన్ని చేనేత సహకార సంఘం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉన్ని చేనేత పారిశ్రామిక సహకార సంఘం, దూర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వలసలు వెళ్లే వారిని అరికట్టడానికి, సొంత గ్రామంలో ఉంటూ, ఉపాధి చూపించడం కోసం ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. మంగళవారం రోజు ఉన్ని చేనేత సహకార సంఘం నూతన గ్రామ కమిటీ లో 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, ఎన్నికైన సభ్యుల వివరాలు. డైరెక్టర్ చింతల వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ మూలమల్ల బీరయ్య, సెక్రెటరీ ఆవుల ఏల్లన్న, ట్రెజరర్ ఏ వెంకటయ్య, డైరెక్టర్స్ జోగు నరసింహ, ఎర్ర మల్లయ్య, మూలమల్ల రాములు, చింతల సరిత, సాంబ. మల్లమ్మ,ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్మికుల భద్రత దృష్ట్యా పలసలు పోకుండా అరికట్టడం, ముఖ్యంగా చేనేత కార్మికులకు వైద్య సదుపాయం, గ్రామములోని ఉపాధి కల్పించుట, ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్స్ స్కీమ్, రుణమాఫీ నేతన్న భరోసా, వంటి ప్రభుత్వ పథకాల ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో… గ్రామా ఉన్ని చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమీటీ సభ్యులు, అడిటర్ శ్రీనివాసులు కు అభినందనలు తెలిపారు. తదితరులు పాల్గొన్నారు.
