ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థి ఎంపిక

📰 Generate e-Paper Clip

జూలై 9 నుంచి 11 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటేందుకు సిద్ధమైన పి. శివశంకర్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 8 2026: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు పెద్దమందడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన పి. శివశంకర్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శాంతన్న మాట్లాడుతూ… రాష్ట్రస్థాయి పోటీల్లో శివశంకర్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించి రాష్ట్రానికి, జిల్లాకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పి. శివశంకర్‌ను ఏఏపీసీ చైర్మన్ మహేశ్వరమ్మ, గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి, ఉపసర్పంచ్ ఉషన్న, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!