ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపహార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు... 

హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు… 

📰 Generate e-Paper Clip

సిపిఆర్ తప్పనిసరి. హార్ట్ ఎటాక్ పేషంటును

90% ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు.

పొలిటికల్ పవర్ పిఎన్9టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు గ్రామంలో ఉన్న స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు (అనస్పెక్టెడ్ గా) అనుకోని విధంగా వచ్చే హార్ట్ ఎటాక్ గురించి ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ( సిపిఆర్) డా క్టర్. దేవసత్య డాక్టర్, కళ్యాణ్ లు తెలిపారు. అలాగే విద్యార్థులు పాఠశాల గ్రౌండ్లో ఆటలాడే సమయంలో పెద్ద దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేసుకోవాలో తెలిపారు. గ్రామాలలో విష పురుగులైన పాము తేలు కుట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ముఖ్యంగా కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కుక్క కరిచినప్పుడు రాబిస్ వ్యాధి రాకుండా నీటితో శుభ్రంగా కడిగి ప్రధమ చికిత్స చేసిన తర్వాత టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ , షైనీ పాల్ . ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!