ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటగుత్తేదారు కక్కుర్తా? అధికారుల అలసత్వమా?*

గుత్తేదారు కక్కుర్తా? అధికారుల అలసత్వమా?*

📰 Generate e-Paper Clip

 

*సీతరామ లో 85 లక్షల కుంభకోణం!*

*అధికార యంత్రాంగం మౌనం పై పలు అనుమానాలు?*
*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్( ఆర్సి కారం వెంకటేష్) జూలై 10:* సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ కెనాల్ సిసి రోడ్లకు, డ్రైనేజి కు ఉపయోగించే సిమెంట్, స్టీల్ దొంగతన విషయం మండలంలో హల్చల్ రేపుతుంది. వివరాల్లోకి వెళితే ఆర్క్కూడా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో కమలాపురం ప్యాకేజీ ఆరో పంప్ హౌస్ లో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి అధికారికంగా టెండర్ దక్కించుకుంది. వాటికి ఉపయోగించే 6500 బ్యాగుల సిమెంటు, 112 టన్నుల స్టీలు దొంగతనం జరిగినట్లు ములకలపల్లి పోలీస్ స్టేషన్ లో కంపెనీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు 85 లక్షలు ఉండొచ్చని అంచనా. పోలీసు విచారణలో అవి రాజపేట, ములకలపల్లి ప్రాంతాల్లో సామాగ్రి ఉన్నట్టు కనుగొన్నట్లు కూడా వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇంతలోనే చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్టీల్, సిమెంట్ తీసుకోని పోయిన వ్యక్తులకు సదరు గుత్తేదారు కొంత డబ్బులు ఇవ్వాలని అందుకే వాళ్ళు అవి తీసుకోని పోయారని, వాటిని తిరిగి వెనక్కు పంపుతున్నామని చెప్పడం జరుగుతుంది. ఇంతకి ఇంత పెద్ద మొత్తం లో స్టీల్, సిమెంట్ ఎక్కడిడో ఎవరికీ అర్ధం కాని విషయం. అంటే ఉపయోగించాల్సిన స్టీల్, సిమెంట్ నూటికి పది శాతం మాత్రమే ఉపయోగించి మిగిలిన మొత్తాన్ని ఇక్కడికి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో అధికారుల పాత్ర వున్నది అనేది మరి కొందరి వాదన. ఏది ఏమైనా ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్న వారిపై సుమోటో గా కేసు నమోదు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!