ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*ఘనంగా రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారం*

📰 Generate e-Paper Clip

 

*మండలంలోని 3 రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం*

*అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు*

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్) జూలై 10:* తొమ్మిది రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో రైతు ఆశీర్వాద సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజులలో 9 వేల కోట్లు నిధులు రైతుల ఖాతాలో విడుదలా చేయడం సంతోషంగా ఉంది అని తెలియజేశారు. మిగిలిన రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసా నిధులు విడుదల చేసారు. కాంగ్రెస్ వచ్చిన 30 నెలలలో రైతులకు వివిధ పధకాల (రైతు భరోసా, రైతు భీమా, రైతు రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు వరికి బోనస్ మరియు పంట నష్ట పరిహారం) ద్వారా లక్ష కోట్లు ఇచ్చినట్లు తెలియజేసారు. ములకలపల్లి మండలంలోని ములకలపల్లి, పూసుగూడెం మరియు జగన్నాధపురం రైతు వేదికలో దృశ్య శ్రవణ మాధ్యమం ( వీడియో కాన్ఫరెన్స్) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మండల వ్యవసాయ అధికారి బి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారుర్లు సుజాత, రాహుల్, సూరిబాబు, రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జహీర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు పెటేటి నర్సింహారావు, సొసైటీ మాజీ చైర్మన్ కరుటూరి కృష్ణ, తిరుపతి రెడ్డి, శనగపటి రవి, రాజేష్ , మిరియాల అవినాష్ మరియు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

Latest Articles

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!