పొలిటికల్ పవర్ జాతీయ సామాగ్ర తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 10 2026: వనపర్తి జిల్లా నిషేధ మరియు ఆబ్కారీ శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి వి గౌడ్ గారు, పెబ్బేరు గౌడ సంగం నాయకులు శ్రీనివాస్ గౌడ్ రామన్ గౌడ్ అరవింద్ చారి దేవర శివ పాల్గొన్నారు. జిల్లాలో మద్యం అక్రమ రవాణా, గుట్కా నిర్మూలన కోసం ఎక్సైజ్ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు స్థానిక నాయకులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు.
