ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విలువల రాజకీయాలకు ఉన్నత శిఖరం స్వర్గీయ సత్తి వీర్రెడ్డి: సబ్బెళ్ళ కృష్ణారెడ్డి

విలువల రాజకీయాలకు ఉన్నత శిఖరం స్వర్గీయ సత్తి వీర్రెడ్డి: సబ్బెళ్ళ కృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip

రామవరంలో ఘనంగా సత్తి వీర్రెడ్డి జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ జాతీయతెలుగు దినపత్రిక

అనపర్తి: విలువలు, నిబద్ధతతో కూడిన రాజకీయాలకు స్వర్గీయ సత్తి వీర్రెడ్డి ఉన్నత శిఖరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు.

విశాఖపట్నం గౌతమి సంస్థల అధినేత సత్తి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి తండ్రి, పాలమూరు నీటి వినియోగదారుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీడీసీ మాజీ చైర్మన్ స్వర్గీయ సత్తి వీర్రెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం రామవరం గ్రామంలోని ఆయన స్వగృహంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వర్గీయ సత్తి వీర్రెడ్డి చిత్రపటానికి, గ్రామంలోని ఆయన కాంస్య విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సబ్బెళ్ళ కృష్ణారెడ్డి మాట్లాడుతూ… స్వర్గీయ సత్తి వీర్రెడ్డి తన రాజకీయ జీవితాన్ని విలువలు, నిజాయితీ, నిబద్ధతతో నడిపించారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసిన ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సీడీసీ చైర్మన్‌గా, పాలమూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా రైతుల సంక్షేమానికి విశేష సేవలందించారని కొనియాడారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా ఆయన నిలిచారన్నారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్ ఆదాడి చిన సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు నల్లమిల్లి చినసత్తిరెడ్డి, గ్రామ పార్టీ కన్వీనర్ నల్లమిల్లి వెంకటరెడ్డి, గుడిమెట్ల వెంకటరెడ్డి, సత్తి రామారెడ్డి, సత్తి సత్యనారాయణరెడ్డి, కోనాల సోమసుందరరెడ్డి, కోనాల రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి రవీంద్రరెడ్డి, సత్తి గాంధీరెడ్డి, సత్తి పోతారెడ్డి, ద్వారంపూడి మంగిరెడ్డి, టేకి వీరరాఘవ, టేకి బాబురావు, ఆదాడి అప్పారావు, మురముళ్ల అశోక్, నల్లమిల్లి ఎరకారెడ్డి, పులగం వెంకటరెడ్డి, నల్లమిల్లి ఆదినారాయణరెడ్డి, నల్లమిల్లి సంధ్య, కర్రి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!