ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

రామవరంలో వైసీపీ శ్రేణులపై దాడి ఘటనపై వైసీపీ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలపై జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి ధ్వజం
    అనపర్తి, జూలై 17: ఇటీవల అనపర్తి మండలం రామవరం గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ అనపర్తిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు.
    విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం అధికార బలంతో భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హయాంలో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలకు కేంద్రంగా మారిందని అన్నారు.
    రామవరంలో వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమని, ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరి నొక్కు శ్రీనుపై కూడా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. దళితులకు చెందిన నందిక సత్యనారాయణతో పాటు పలువురు తీవ్రంగా గాయపడినా పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి ఈ అంశాన్ని అసెంబ్లీ, పార్లమెంట్ వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు.
    అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు నియోజకవర్గంలో రౌడీయిజం, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బాధితులను పరామర్శించేందుకు తాము వస్తున్న విషయం తెలిసి ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని కాపాడేందుకు వైసీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించారని ఆరోపించారు.
    నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపైనే రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు, దాడులకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Latest Articles

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం

  తొస్సిపూడిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పర్యటన జెడ్పీటీసీ అభ్యర్థి...

వర్షంలో ఆకలితో ఉన్నవారికి JSPW అన్నదానం

ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్లపై నిరుపేదలు, ప్రయాణికులకు ఆహారం పంపిణీ ...

తొమ్మిదేళ్లు దోసుకొన్న దొంగలు మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరా..

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం విలేకరుల సమావేశంలో మంత్రి...

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై...

Related Articles

జగన్‌మోహన్ రెడ్డి అంత అమాయకుడు ఏమీ కాదు క్రింద కూర్చొని నిరసన తెలియజేయటానికి చంద్రబాబూ… ఆయన రాజకీయ ఎత్తుగడలు అర్థం చేసుకోవటం నీ కొడుకు లోకేష్ కి, పవణ్ కళ్యాణ్ కి అర్ధం...

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పులివెందుల ఆర్.ఓ. కార్యాలయం దగ్గర మాజీ ముఖ్యమంత్రి...

కదిరిలో బి.ఎస్. మక్బూల్ మార్క్… 14వ వార్డులో ఓటు హక్కు వినియోగం!

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*కదిరి:కదిరి మున్సిపల్ ఎన్నికల క్షేత్రం పూర్తిగా వేడెక్కింది....

ఐరన్ లేడీ ఇందిరా గాంధీకి ఘన నివాళి! సూర్యాపేట సమరం: కాంగ్రెస్ శ్రేణుల భారీ ప్రదర్శన, గాంధీ కుటుంబ త్యాగాల స్మరణ!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సూర్యాపేట, అక్టోబర్ 31 (...
error: Content is protected !!