ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు మాత శిశు సంక్షేమ కేంద్రం పరిసరాల్లో ఉన్న హోటల్ పార్కింగ్ మాఫియా 10 సంవత్సరాల నుంచి అక్రమంగా నడుస్తోంది

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు మాత శిశు ఆరోగ్య కేంద్రం లోకి రావాలంటే రోగులు భయపడుతున్నారు ఎందుకంటే వైద్యం చేయటానికి డాక్టర్లు ఉంటారో లేదో తెలియదు కానీ అక్కడికి వచ్చే వారిని మాత్రం పార్కింగ్ పేరుతో ప్రజలను దోచుకొని బెం బేలెత్తిస్తున్న ఒక ముఠా పది సంవత్సరాల నుంచి సంచరిస్తూ వారి ఆడింది ఆట పాడింది పాటగా గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల్లో సాగుతోంది దీనికి కారణం ఎవరు అని ఆరా తీయగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరే ఈ అరాచకాలకు కారణమని ప్రజలు రోగులు రోగుల సంబంధిత వ్యక్తులు ఆరోపిస్తున్నారు అలాగే ప్రభుత్వ జనరల్ హాస్పటల్ మాత శిశు ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో ఉన్న టిఫిను భోజనం దొరికే ఒక ప్రాంతం లో ఇష్టానుసారంగా నీళ్ల బాటిల్ రేట్లు ఇష్టానుసారంగా ఉన్నాయని ప్రజలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఖమ్మం నగరానికే చెందిన ఒక మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పదవిని అనుభవిస్తున్నారు అలాంటి వ్యక్తి ఉన్న వ్యక్తులు ఉన్న ప్రాంతంలోనే హాస్పటల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే మిగతా ఊర్లలో మండల కేంద్రాల్లో పట్టణాల్లో ఉండే ఆరోగ్య కేంద్రాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయుతోంది ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చి ఇన్ పేషెంట్గా జాయిన్ అయిన వారికి పేషెంట్ కు మరియు పేషెంట్ అటెండర్ కు ఇద్దరికీ ప్రభుత్వమే భోజనం అంది ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఈ స్కీమును నిర్వహించడానికి గత పది సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒకే ఏజెన్సీకి ఫుడ్ కాంట్రాక్ట్ ఇవ్వటం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల గురించి చెప్పాలంటే పుంకాలు పుంకాలుగా రాయవలసి ఉంటుంది

Latest Articles

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద...

మల్కారంలో ఘనంగా శ్రీ గౌరీ గణపతి పూజ మహోత్సవాన్ని జరిపించిన నాగబాబు-సుజాత దంపతులు

పొలిటికల్ పవర్,సెప్టెంబర్ 16: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం...

ఆ వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తున్న జిల్లా సైన్స్ ఆఫీసర్

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతీరు మార్చుకోలేని సైన్స్...

సత్యనారాయణ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన కాకాని

పొలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ...

Related Articles

దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచి. ఫామ్ హౌస్ లో పసుపు నీళ్లు చల్లడాన్ని నిరసిస్తూ టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో.నిర్వహించరు//జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...
error: Content is protected !!