పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
తీరు మార్చుకోలేని సైన్స్ ఆఫీసర్ అంటూ వివిధ దినపత్రికలో వచ్చిన అంశానికి సంబంధించి జిల్లా సైన్స్ అధికారి గౌరవ శ్రీ కటకం మధుకర్ గారి ఖండనకు రుజువులను పత్రికా ముఖంగా వెల్లడి చేస్తున్నాం ఉల్టా చోర్ కోత్వవాల్ కో డాటే.. అన్నట్లు ఉన్నది ఏ సైన్స్ అధికారి నైజం.
మా లక్ష్యం మా ఆశయం మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఎమ్మార్పీఎస్ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆలోచన విధానం అందరికీ అన్ని జాతులకు సమాన అవకాశాలు దక్కాలి అన్నదే మా దేయం బోధించు సమీకరించు పోరాడు అన్నాడు మా ఆరాధ్య దైవం బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ నినాదం అందిపుచ్చుకొని కొమరం భీం జిల్లాలో జిల్లా సైన్స్ ఆఫీసర్ కటకం మధుకర్ గారి ఆగడాలు నిరంకుశత్వం పక్షపాత వైఖరి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులను అణగద్రొక్కి కేవలం తనకు జేజేలు కొట్టించుకుంటున్నారు ఈడిఎస్ ఓ . అడ్డదారిలో అందలం ఎక్కుతూ ఓహో ఆహా అంటూ జిల్లాలోని సైన్సు ఉపాధ్యాయుల ముందు తన బలనిరూపణ చేసుకుంటున్నారు పత్రిక విలేకరులను ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారికి ఫోన్లు చేస్తూ హెచ్చరిస్తూ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులో సెట్టింగ్లను మార్చేలా ఒత్తిడి పెంచుతున్నారు ఈయన ధాటికి టీచర్లు గజగజ వనికి పోతున్నారు ఇక అసలు విషయానికొస్తే
జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లేక ఎంపీపీ ఎస్ సర్ సిల్క్ కాగజ్నగర్ డివిజనల్ సైన్స్ సెంటర్ రా? లింగాపూర్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎంపీపీ ఎస్ సర్ సిల్క్ ఎలా అనుకూలం అవుతుంది. డి ఎస్ ఓ చెప్పినట్లే పది సంవత్సరాల నుండి ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నట్లే కదా జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులలో ఉంటే అట్టి కాపీని బహిరంగపరచవలసిన అవసరం ఉంది నోటి మాటకే చెప్తే సరిపోదు.
మామిడాల తిరుపతయ్య కులం పద్మశాలి డీయస్ ఓ కు స్వయానా గురువు. కాదని ఎవరు చెప్పగలరు నిరూపించడానికి సిద్ధం తిరుపతయ్య ప్రతి సైన్స్ కార్యక్రమంలో కోఆర్డినేటర్ గా ఉంటున్నది నిజం కాదా? 2025 విద్యార్థి సెమినార్ లో తిరుపతయ్య శిష్యుని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపించినది నిజం కాదా? 2025 విద్యార్థి సెమినార్ రికార్డులు తీయండి దానికి జడ్జిగా వచ్చిన వారి వివరాలు బహిరంగపరచండి తన కులం వారు జడ్జిగా ఉన్నది నిజం కాదా?
లక్ష్మీ ప్రసన్న సిఆర్టి కేజీబీవీ కాగజ్నగర్ గారు ఎన్నిసార్లు రిసోర్స్ పర్సన్ గా చేశారు వివరాలు ఇవ్వండి సరిపోదు రెగ్యులర్ సీనియర్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు చాలామంది ఉండగా ఈ లక్ష్మీప్రసన్ననే ఎందుకు ఎంచుకుంటున్నారు అవకాశాలు కల్పిస్తున్నారు జిల్లాలో ఇతర మహిళా ఉపాధ్యాయులు లేరా?. ధర్మపురి వెంకటేశ్వర్లు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జనకాపూర్ గారు సైన్స్ అంశాలకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కు అసలు సంబంధమే లేదు ఇది గ్రూప్ ఇజం తప్ప వేరొకటి కాదు ఆ మాటకొస్తే ధర్మపురి వెంకటేశ్వర్లు ఒక్కడే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో వాక్యాతగా లేరు ఎస్సీ దళిత కులానికి చెందిన కాంపెల్లి ఉషన్న ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కూడా ప్రభుత్వ కార్యక్రమాలలో వాక్యాతగా వ్యవహరిస్తున్నారు. కాంపల్లి ఉషన్న గారు ఎస్సీ కాబట్టి ఈయనకు అవకాశం ఇవ్వడం జిల్లా సైన్స్ అధికారికి ఇష్టం లేదు. ధర్మపురి వెంకటేశ్వర్లు కంటే కూడా చాలా నయం ఎందుకంటే కంపల్లి ఉషన్నగారు మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు గతంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు చాలా సేవలు అందించారు ఇది ఈ సైన్స్ ఆఫీసర్ కు కనబడటం లేదా ఎందుకంటే ఈ డి ఎస్ ఓ కు ఎస్ సి ఎస్టీలు అంటే నచ్చదు కేవలం తన కులం వారు మాత్రమే కావాలి.
. తేదీ 22 ఏప్రిల్ 2026 తేదీన మాస్టర్ మైండ్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి లలితా మేడం గారికి గ్రీన్ టీచర్ గా పరిచయం చేసిన విషయం ఈనాడు దినపత్రికలో రాయబడింది ఆధారాలు చూడండి ఇస్తున్నాను ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలి రుజువులను కూడా అబద్ధాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అబద్దాలకోరు ఈ జిల్లా సైన్స్ అధికారి.
. సైన్స్ సంబంధ పోటీలలో నిర్వహణలో ఒక బినామీ వ్యక్తిని నియమించి ఆయనతో ప్రాజెక్టులు చేయిస్తూ అవి కూడా పూర్తిగా సెన్సార్ కు సంబంధించినవి అతని నుండి పర్సెంటేజీలు తీసుకొని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయవలసిన ఈ డి ఎస్ ఓ గారు మరమనుషులను తయారు చేస్తున్నారు ఆ బినామీ వ్యక్తి తయారు చేసిన ప్రాజెక్టులు మాత్రమే ఇన్స్పైర్ లో సెలెక్ట్ అయ్యేలా చూస్తున్నారు కారణం పర్సంటేజీలు.
. ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వారిపై ఆకాశరామన్న ఉత్తరాలు రాయించి అధికారులకు కంప్లీట్ పెడుతూ వారి అవకాశాలను కొల్లగొడుతున్నారు దేనికి సరియైన ఉదాహరణలు రాకేష్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేడువాయి గారిపై మరియు వడ్లూరి రాజేష్ స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జంకాపూర్ గారిపై ఇలాంటి ప్రయత్నాలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారు అందుకే జిల్లాలోని సమస్త ఉపాధ్యాయులు ఈ డి ఎస్ అంటే వణికిపోతున్నారు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు ఆయన బాధితులు ఎందరో అనేక మార్గాలలో తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నార8. వడ్లూరి రాజేష్ ఉపాధ్యాయిని విషయంలో అయితే పట్టు పట్టి రాష్ట్రస్థాయి అధికారుల వద్ద తన అన్యాయులతో బల నిరూపణ చేస్తూ ఎక్స్పోజర్ విజిట్ కు ఎంపికైన వడ్లు రాజేష్ ను పోకుండా రద్దు చేయించారు అలాగే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు విషయంలో గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అవార్డుల సమయంలోనే కంప్లీట్ లు పెడుతూ తనకు అవార్డు రాకుండా అడ్డుకుంటున్నారు.. జిల్లాలో సైన్స్ కార్యక్రమాలు ప్రభుత్వ నిబంధనలు ఉన్నతాధికారుల సూచనలు పారదర్శక విధానాల ప్రకారమే నిర్వహిస్తున్న అని పైన చెప్పిన లోలోపల మాత్రం జరిగేది కులపిచ్చి బంధుప్రీతి అన్యాయులకు అందలం తనదే రాజ్యం.ఈ జిల్లా సైన్స్ అధికారి 2016 నుండి డిఎస్ఓగా పనిచేస్తున్నారు. ఈయన గారు ఏమైనా పై నుండి బాండ్ పేపరు రాయించుకొని వచ్చారా జన్మతః తానే డీఎస్ఓగా ఉంటానని కావున ఇలాంటి అధికారి జిల్లా సైన్స్ అధికారిగా ఉంటే సైన్స్ లో విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రతిభ మరుగున పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో sc st monority Bc లు పెద విద్యార్థులు చదువుతున్నారు. కావున వెంటనే ఈ సైన్స్ అధికారిని కటకం మధుకర్ నుతొలగించి మంచి వ్యక్తికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి విజ్ఞప్తి చేస్తున్నామని ఈ అధికారి మాటలు విని ఆయన్నే కోనసాగిస్తె వివిధ రకాలుగా నిరసన తెలియజేస్తాం . ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ యం ఆర్ పి యస్ న్యాయ పోరాటం చేస్తుంది ఒక ప్రకటనలో పొన్నాల నారాయణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకులు కోరినారు.

