పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 24 2026: తెలుగు చదువు మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దుతుందని అది నిరంతర కృషివల్లనే సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ… చదువుకు పేదరికం అడ్డుకాదని సంకల్ప బలంతో ఎంతటి స్థాయికైన ఎదుగవచ్చు అని ఆయన సూచించారు. పిల్లలు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ కష్టపడే తత్వాన్ని అలవరచుకోవాలని అందుకు సమాజం, ఉపాధ్యాయుల తోడ్పాటు ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని, దానికి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే నిదర్శనమని అన్నారు. హెచ్ ఎం. ఎస్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ… పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, ఉత్తమ ఫలితాలు సాధించడానికి తమ పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు చక్కని సహకారం అందించారని తెలిపారు. అనంతరం మెడిసిన్ స్టూడెంట్ కృతికకు దాత బాలవర్దన్ రెడ్డి ఇచ్చిన యాభై వేలు, పదవ తరగతి జిల్లా టాపర్ నజీరకు ముప్పై వేలు, అత్యధిక మార్కులు సాధించిన ఆదిల్, భార్గవి, భాను ప్రకాశ్, జయచంద్ర, జ్ఞానేశ్వరిలకు వెయ్యి రూపాయల చొప్పున దాతలు ఇచ్చిన నగదును డిఇఒ యాదయ్య అందజేశారు. దాతలు గంధం మదన్, వాకిట రవికుమార్ (కౌన్సిలర్ ),అరవిందులను శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ హెడ్మాస్టర్ లు సూర చంద్ర శేఖర్, గణేశ్ కుమార్, సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, రిటైర్డ్ ఎం ఇ ఓ శ్రీనివాస్ గౌడ్, ఏసేపు, ప్రతాపరెడ్డి, శ్రీనివాస్ రావు, మహిపాల్ రెడ్డి, గంధం నాగరాజు, భోజరాజు, వెంకటేష్, విశ్వంబాబు, బైరోజు చంద్ర శేఖర్, బండారు శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
