బంద్ కు విరుద్ధంగా పేరెంట్స్ మీటింగ్ లు పెట్టడం బాధాకరం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎం, వెంకటేశ్వర్లు, కడప (జిల్లా) బ్రాహ్మగారిమాటం:- దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక, రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్‌లో భాగంగా బ్రహ్మంగారిమఠం మండలంలో బంద్ విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. ఈ బంద్‌లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు సోమిరెడ్డిపల్లి అరవింద్ లు మాట్లాడుతూ… నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన బంద్‌కు అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ తమ విద్యాసంస్థలను మూసివేయడం అభినందనీయమన్నారు. అయితే ప్రభుత్వ విద్యాసంస్థల వద్ద పోలీసులను మోహరించి బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన నిరసనలను అణచివేయడం తగదని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు దేవకుమార్ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమిరెడ్డిపల్లి ఓబులేసు, విజయ భాస్కర్, సందీప్, తిప్పన రాజా, ప్రభాస్, రమేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.





