ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆత్మకూరులో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్రజలు కార్యాలయం సంప్రదించగలరు..

ఆత్మకూరులో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్రజలు కార్యాలయం సంప్రదించగలరు..

📰 Generate e-Paper Clip

ఆత్మకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయ సబ్ రిజిస్టర్ టి శ్రీనివాసరావు వెల్లడి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్ 9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి జులై 27 2026: డాక్యుమెంట్ రైటర్స్ స్టాప్ వెల్డర్స్ సమ్మెతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్టర్ టి. శ్రీనివాసరావు తెలిపారు.. ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోదలచిన ఆస్తి వివరాలతో తమను నేరుగా సంప్రదిస్తే అందుకు కావలసిన డాక్యుమెంట్ సిద్ధం చేసి రిజిస్ట్రేషన్ చేసి సాయంత్రానికి వాటిని తిరిగి పత్రాలు అందిస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా సొంతంగా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని వచ్చిన వెంటనే చలానా కట్టే విధానము ఇతర విషయాలు తెలిపి రిజిస్ట్రేషన్ చేస్తామని అలాగే స్టాంపులు కూడా తమ వద్దనే అమ్ముతున్నామని వాటిని అవసరమైన వారు కొనుగోలు చేయవచ్చని వారు తెలిపారు.. కార్యాలయంలో తమ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నారని సమ్మెతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టవచ్చని వారు ప్రజలకు కోరారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!