ePaper
Monday, September 14, 2026
📄 ePaper

పీరారామచంద్రపురం సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

📰 Generate e-Paper Clip

 

 

అనపర్తి: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని పీరారామచంద్రపురం శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు, అర్చనలు, గురుపూజ, హారతి కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తమలంపూడి సత్యనారాయణరెడ్డి–అన్నపూర్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారి ఆశీస్సులు పొందారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయం సుందరంగా అలంకరించబడగా, సాయినామ స్మరణలు, భజనలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి.
ఈ కార్యక్రమంలో తమలంపూడి కృష్ణారెడ్డి, తమలంపూడి రాజేందర్‌రెడ్డి–పద్మశ్రీ దంపతులు, కోణాల వెంకట సాయిరామరెడ్డి–శేషారత్నం దంపతులు, కోణాల వీర వెంకట సత్యనారాయణరెడ్డి–పద్మ దంపతులు, కర్రీ గోవిందరెడ్డి, నల్లమిల్లి సాయిలక్ష్మి, పడాల హైమావతి, నల్లమిల్లి పుష్పావతి, నల్లమిల్లి జయశ్రీ, నల్లమిల్లి శాంతి, పడాల సాయిలక్ష్మి తదితరులు పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ గ్రామ పురోహితులు రాము పంతులు వేదోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు సాయిబాబా అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

Related Articles

*శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఐదవ వార్షికోత్సవ సన్నాహక సమావేశం*

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగా రావుమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ లో వినాయక నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి...

బలభద్రపురంలో బోనాల సంబరం.. భక్తి పారవశ్యంలో తొలి మహోత్సవం

 పొలిటికల్ పవర్ న్యూస్ అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, బిక్కవోలు, ఆగస్టు 3: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో శ్రీ మాతృశ్రీ శ్రీ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మవారి తొలి బోనాల...

గురు పౌర్ణమి సందర్భంగా ఆంధ్ర షిర్డి సాయి మందిర్‌కు పోటెత్తిన భక్తజనం

  తూర్పుగోదావరి జిల్లా: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిర్డిగా ప్రసిద్ధి చెందిన సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. వేలాది మంది భక్తులు...
error: Content is protected !!