ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅమ్మ కోసం ఒక చెట్టు నాటుద్దాము పర్యావరణ కాపుడుద్దాము

అమ్మ కోసం ఒక చెట్టు నాటుద్దాము పర్యావరణ కాపుడుద్దాము

📰 Generate e-Paper Clip

పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: రేడియంట్ ఉన్నత పాఠశాల పెద్దగూడెం శివారులోని స్కూల్‌లో అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మరియు స్కూల్ డైరెక్టర్ కౌసల్య పాల్గొన్నారు, ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడారు. ప్రతి వ్యక్తి తన తల్లి పేరు మీద కనీసం ఒక చెట్టు నాటాలి అన్నారు. అమ్మ మనకు జన్మనిస్తుంది, చెట్టు మనకు జీవితాన్ని ఇస్తుంధి అందుకే అమ్మకు, చెట్టుకు ఉన్న సంబంధాన్ని శంకర్ గౌడ్ గుర్తు చేస్తారు. చెట్లు గాలి కాలుష్యాన్ని తగ్గించి మనకు స్వచ్ఛమైన గాలి ఇస్తాయి.వర్షాలు బాగా కురవడానికి, భూగర్భ జలాలు పెరగడానికి చెట్లు చాలా అవసరం చెట్టు నాటిన తర్వాత దానిని అమ్మలాగే ప్రేమగా పెంచాలి అన్నారు. కౌసల్య మాట్లాడుతూ… ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో కూడా పర్యావరణ స్పృహ పెరుగుతుంది అన్నారు. ఒక చెట్టు పెంచడం అంటే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఇవ్వడం. అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. చెట్టు ఆరోగ్యంగా ఉంటే భూమి ఆరోగ్యంగా ఉంటుంది అన్ని అన్నారు. ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్ మాట్లాడారు ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజు, కూడా చెట్టు నాటలీ. చెట్టు నాటడం చిన్న పని, కానీ దాని ఫలితం చాలా పెద్దది. మనమందరం మన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి ప్రకృతిని కాపాడుకుందాం అన్నారు. ప్రోగ్రామ్ లో ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్, వైస్ ప్రిన్సిపాల్ రాము, ఎకో క్లబ్ కన్వీనర్ శృతి ఉపాధ్యాయులు, నరేష్, శాంతయ్య, రాహుల్, శ్రీనివాస్, రాజిత, సావిత్రి, సాత్విక, రామేశ్వరి, ఖదీరున్నీసా, సరోజ, అఖిల్, పీఈటీ వెంకటేష్, మరియు తల్లిదండ్రులు తధితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!