ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeతెలంగాణనిజామాబాద్ఆచార్య బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఔషధ మొక్కల దినోత్సవం...

ఆచార్య బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఔషధ మొక్కల దినోత్సవం…

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 4 ఆగస్టు 2026.

 

రుద్రూర్ మండల కేంద్రంలోని పతంజలి యోగ మరియు ధ్యాన కేంద్రం నందు మంగళవారం ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ 55వ జన్మదినం సందర్భంగా ఔషధ మొక్కల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

మహర్షి పతంజలి యజ్ఞ సహిత యోగ మరియు ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 4 వ తేదీన ఔషధ మొక్కల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుద్రూర్ లో ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు యజ్ఞం, యోగ సాధన మరియు వివిధ రకాల ఔషధ మొక్కలను నాటడం జరిగింది.

ఆచార్య బాలకృష్ణ గారు కొన్ని లక్షల ఆయుర్వేద మొక్కలపై పరిశోధనలు చేసి అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడే శక్తి ఆయుర్వేద వనమూలికలలో దాగి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఆచార్య బాలకృష్ణ అని, కావున ఆయన జన్మదినం సందర్భంగా తిప్పతీగ దీనినే సంస్కృతంలో అమృతవల్లి (గిలోయ్) అనే 55 మొక్కలను గ్రామ ప్రజలకు వితరణ చేశారు. అనంతరం గోశాలలో గోవులకు దాన అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్, రుద్రూర్ మండల అధ్యక్షులు పుట్టి సాయిబాబా, యువభారత్ అధ్యక్షులు గబాలే పురుషోత్తం, బి ఎస్ టి బోధన్ డివిజన్ అధ్యక్షులు బెజుగం వెంకటేశం గుప్త, ఆత్మెల హన్మాండ్లు, తోట్ల గంగారాం, చంద పోశెట్టి, సత్యనారాయణ మరియు గో సేవకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!