ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి

వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి

📰 Generate e-Paper Clip

 సత్వరన్యాయంప్రజలకుమర్యాదపూర్వక,పారదర్శకపోలీసులసేవలేలక్ష్యం,ఆకతాయిలు, అసాంఘిక శక్తులు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 07. 2026.
ప్రజలకు మరింతనాణ్యమైన,పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, ఐపీఎస్ అన్నారు. ప్రజల భద్రత, చట్టవ్యవస్థ పరిరక్షణ, బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగాపనిచేయాలనిఆమెసూచించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగావినియోగిస్తూప్రజలవిశ్వాసాన్నిమరింతబలోపేతం చేయాలని  పేర్కొన్నారు.గురువారం  జిల్లా ఎస్పీ.  సునిత రెడ్డి ఐపీఎస్.  వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి ఫిర్యాదుల స్వీకరణ, బాధితులతో సిబ్బంది వ్యవహరించే తీరు, ఫిర్యాదుల నమోదు, పరిష్కార విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి మర్యాదపూర్వకంగా స్పందిస్తూ, ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించే విధంగా పనిచేయాలని రిసెప్షన్ సిబ్బందిని ఆదేశించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల నిర్వహణ, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, సమస్యాత్మక వ్యక్తులరికార్డులు,సాంకేతికపరిజ్ఞానంవినియోగం వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ఆధునిక పోలీసింగ్ విధానాలను అనుసరించి ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవంగామర్యాదపూర్వకంగాస్వాగతించి,వారిసమస్యలను ఓర్పుతో విని, ప్రతి ఫిర్యాదుపై సత్వరమేస్పందిస్తూ బాధితులకు న్యాయం, భరోసా కల్పించడం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రథమ కర్తవ్యమని సూచించారు. ప్రజల్లో పోలీస్ శాఖపైవిశ్వాసంమరింతపెరిగేలాపారదర్శకంగా,బాధ్యతాయుతంగాసేవలుఅందించాలనిఆదేశించారు.శాంతిభద్రతలపరిరక్షణకుప్రత్యేకప్రాధాన్యతఇస్తూరాత్రింబవళ్లు పెట్రోలింగ్,నిఘాచర్యలుకొనసాగుతున్నాయని తెలిపారు. ఆకతాయిలు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వ్యక్తులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైఎలాంటిరాజీలేకుండాచట్టపరంగాకఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికల్లో అసత్య ప్రచారాలు,వదంతులు,ప్రజలనురెచ్చగొట్టేపోస్టులు లేదా చట్టవ్యవస్థకు భంగం కలిగించే సందేశాలను ప్రచారం చేసే వారిని గుర్తించి సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియానుబాధ్యతాయుతంగావినియోగించాలని, ధృవీకరించని సమాచారాన్ని ఇతరులకు పంపకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనేనేరరహిత,సురక్షితసమాజనిర్మాణంసాధ్యమవుతుందని పేర్కొంటూ, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్–112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలనిజిల్లాఎస్పీ.ప్రజలకుపిలుపునిచ్చారు.ఈ తనిఖీలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, వనపర్తి సీఐ. సుగంధరత్నం, వనపర్తి రూరల్ ఎస్సై. హృషికేష్, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!